ఏపీ సీఎం చంద్రబాబు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. బీజేపీకి మద్దతుపై పునరాలోచించుకోవాలని లేఖలో సూచించారు. అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు సమర్థనీయం కాదని.. కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అయినా అమిత్ షా కనీసం క్షమాపణ కూడా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాను ప్రధాని సమర్థిస్తున్నారన్నారు. అలాంటి వారికి మద్దతు పలకటం సరికాదని తెలిపారు.