కడప: ఇటీవల నగరంలోని వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ క్రమంలో ఈరోజు నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డితో సహా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి వారికి టీడీపీ కండువా కప్పారు. కార్పొరేటర్లు, పార్టీ ఇన్ఛార్జులను టీడీపీలోకి ఆహ్వానించారు.