బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తోన్న మూవీ ‘రామాయణ’. తాజాగా ఈ సినిమాపై నటుడు ముఖేష్ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాముడి పాత్రలో నటించే వారు రావణుడిలా కనిపించకూడదని చెప్పారు. ఆ పాత్రలో నటించినన్ని రోజులు కొన్ని అలవాట్లు మార్చుకోవాలని తెలిపారు. కాగా, ఈ మూవీకి నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక 2026 దీపావళికి ఈ మూవీ మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానుంది.