కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. తాజాగా ఆయన చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. కాగా, ఈ నెల 24న ఆయనకు ట్రీట్మెంట్ జరగనుంది.