NLR: ముత్తుకూరు మండలంలో 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత మూడు రోజుల నుంచి కూడా మండల వ్యాప్తంగా వాతావరణం చల్లగా మారింది. చలిగాలులు వీస్తుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. వర్షం రాకతో ప్రజలు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సూచించి ఉన్నారు.