TG: అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతోన్న తరుణంలో బీజేపీ వినూత్న నిరసన చేపట్టింది. రాష్ట్రంలోని రైతుల సమస్యలను తీర్చాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలంతా ఎడ్లబండిలో సభకు హాజరయ్యారు. రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే తాము ఎండ్లబండిపై అసెంబ్లీ సమావేశాలకు హాజరైనట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు.