కృష్ణా: వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై గురువారం విచారణ జరిగింది. ఈ కేసు విచారించిన హైకోర్టు తదుపరి విచారణను 2025 ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసినట్లు తెలిపింది. కాగా, సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై భార్గవరెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. ఆయన వాటిని క్వాష్ చేయాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు.