AP: సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు కొనసాగించాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పలు శాఖల్లో దస్త్రాలు పేరుకుపోతుండటంపై, మంత్రులు సక్రమంగా సాంకేతికతను వినియోగించకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరును ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నానని ఆయన వెల్లడించారు. మంత్రి వద్దకు వచ్చిన దస్త్రం ఎంత సేపు పెండింగ్లో ఉంటుందో తనకు తెలుసని తెలిపారు.