ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆస్పత్రికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వెళ్లారు. గాయపడిన బీజేపీ ఎంపీలను ఆయన పరామర్శించారు. ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేష్ రాజ్‌పుత్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తమ ఇద్దరు ఎంపీలకు గాయాలయినట్లు తెలిపారు. ప్రతాప్ సారంగి తలపై రెండు కుట్లు పడ్డాయని చెప్పారు. ముకేష్ రాజ్‌పుత్ తలకు కూడా గాయమయిందని పేర్కొన్నారు.