NDL: రైతులకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు మార్చి 15 చివరి తేదీ అని మంగళవారం నందికొట్కూరు మండల వ్యవసాయ అధికారి షేక్షావలి తెలిపారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఇతర వ్యవసాయ సంబంధిత సేవలను పొందడానికి ఈ సంఖ్య అధికారిక గుర్తింపుగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి, రైతు గుర్తింపు సంఖ్య పొందవచ్చన్నారు.