సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలో 150 ప్రభుత్వ పాఠశాల భవనాలు అసంపూర్ణంగా ఉన్నాయని, వాటి నిర్మాణాలను పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే పల్లె సింధూర కోరారు. మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ… ‘నాడు-నేడు’లో భాగంగా ప్రారంభమైన పనులు పూర్తికాలేదని తెలిపారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.