అమెరికాకు అక్రమ మార్గంలో వెళ్తూ నికరాగ్వాలో ఓ భారతీయుడు మరణించాడు. మృతుడు గుజరాత్‌లోని సబర్‌కాంఠా జిల్లాలోని మోయద్కు చెందిన దిలీప్ పటేల్‌గా అధికారులు గుర్తించారు. తన భార్య, చిన్నారితో కలిసి డంకీ రూట్లో అమెరికాకు బయలుదేరాడు. మధుమేహంతో బాధపడుతున్న అతని ఆరోగ్యం మార్గమధ్యలో క్షీణించింది. అతని దగ్గర మందులు లేకపోవడంతో కోమాలోకి వెళ్లి మృతిచెందాడు.