కృష్ణా: జిల్లాను నేర రహితంగా మార్చేందుకు ప్రతి పోలీస్ కృషి చేయాలని SP గంగాధరరావు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచి, అనుమానం వచ్చిన వెంటనే పోలీసు చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. మహిళలు, పిల్లలకు సంబంధించిన నేరాల విషయంలో పోలీసులు వెంటనే FIR నమోదు చేయాలని సూచించారు.