AP: ఉచిత ఇసుక విధానంపై వైసీపీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గతంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. తమ పాలనలో ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చినట్లు తెలిపారు. లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలనే తీసుకుంటున్నామని అన్నారు. పారదర్శకంగా ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.