NDL: ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామ సమీపంలోని కుందూనది వంతెనపై ఏర్పాటు చేసిన సిమెంట్ పైపులైన్ లీకేజీ అవుతోంది. దీంతో రూపనగుడిలోని ఎస్సీ కాలనీకి వారం రోజులుగా నీళ్ల సరఫరా లేదు. కాలనీలో దాదాపు 100 కుటుంబాలు ఉన్నాయి. నీళ్ల కోసం కాలనీ వాసులు కుందూకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి పైపులైనుకు మరమ్మతులు చేసి నీళ్లు అందించాలని కోరుతున్నారు.