కృష్ణా: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసి రోజులు గడుస్తున్నా జిల్లాలో పలుచోట్ల ఇంకా రాజకీయ నాయకుల విగ్రహాలకి ముసుగు తొలగలేదు. బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ముసుకు ఇంకా అలానే ఉందని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ముసుగును తొలగించాలని కోరుతున్నారు.