ఉన్నత చదువుల కోసం ఓ తెలుగు యువకుడు విదేశాలకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కెనడాలో చోటుచేసుకుంది. విశాఖ గాజువాకకు చెందిన నాగప్రసాద్, గీతాబాయి దంపతుల కుమారుడు ఫణికుమార్ ఇటీవల ఎంఎస్ కోసం కెనడా వెళ్లాడు. తాజాగా గుండెపోటుతో ఫణి మరణించాడంటూ నాగప్రసాద్కు అతని రూమ్మేట్ ఫోన్ చేసి చెప్పాడు. దీనిపై కెనడా పోలీసులు విచారణ చేస్తున్నారని వివరించాడు. దీంతో ఖంగుతిన్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.