SRPT: కోదాడ మండలపరిధిలోని గుడిబండ గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల సర్వే శరవేగంగా కొనసాగుతుంది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను అధికారులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, గ్రామపంచాయతీ కార్యదర్శి నర్మద, సిబ్బంది సూరి, బిల్ కలెక్టర్ ఉషా పాల్గొన్నారు.