ప్రకాశం: జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల దరఖాస్తుల్లో విద్యార్థి పేరు, తల్లిదండ్రులు పేర్లు పుట్టిన తేదీలో తప్పులు ఉంటే గురువారం నుంచి ఈనెల 23వ తేదీవరకు ఆన్లైన్లో సరిచేసుకోవచ్చని డీఈవో కిరణ్ కుమార్ చెప్పారు. పాఠశాలల హెచ్ఎంలు ఈ విషయం గమనించి విద్యార్థుల వివరాలను సరి చేయాలన్నారు.