NLR: సూళ్లూరుపేట పట్టణంలోని హోలీ క్రాస్ సర్కిల్ వద్ద బుధవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న 25 టన్నుల ఆంధ్ర, తమిళ రేషన్ బియ్యాన్ని పోలీసులు, సివిల్ సప్లయిస్ అధికారులు పట్టుకున్నారు. యల్లావూరు నుంచి నెల్లూరుకు తరలిస్తున్నట్లు గుర్తించి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని నాయుడుపేట సివిల్ సప్లయీస్ గిడ్డంగులకు తరలించారు.