బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘బేబీ జాన్’ ఈ నెల 25న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’తో ఈ సినిమా పోటీ పడబోతుందని వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై దర్శకుడు అట్లీ స్పందించారు. ‘పుష్ప 2 డిసెంబర్ మొదటివారంలో రిలీజ్ కాగా ఈ సినిమా చివరి వారంలో విడుదలవుతుంది. వాటి మధ్య పోటీ ఎందుకు ఉంటుంది. ఈ సినిమా విజయం సాధించాలని బన్నీ కోరుకున్నారు. మా టీంకు విషెస్ చెప్పారు’ అంటూ చెప్పుకొచ్చారు.