TG: అసెంబ్లీలో విపక్షాల తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. సభలో చర్చ జరగకుండా అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ప్లకార్డులు తీసుకువచ్చినా.. స్లోగన్స్ చేసినా బయటకు పంపించివేస్తామని ప్రతిపక్షాలకు వార్నింగ్ ఇచ్చారు. వెల్లోకి విపక్ష సభ్యులు రాకూడదని స్పీకర్ సూచించారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రైతుల వేషధారణలో వచ్చారు.