తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చిన వివిధ కోచింగ్ సెంటర్లపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఆయా సెంటర్లకు 45 నోటీసులు జారీ చేసింది. 19 కోచింగ్ సెంటర్లకు రూ.61.6 లక్షల జరిమానాను విధించింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు చేపట్టినట్లు కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ వెల్లడించారు. రూ.1.15 కోట్లకు పైగా విలువైన ఫీజును కొంత మంది అభ్యర్థులకు తిరిగి ఇప్పించినట్లు పేర్కొన్నారు.