జమ్మూకశ్మీర్లో చలి తీవ్రత భారీగా పెరిగింది. కశ్మీర్ లోయలో ఎముకలు కొరికేంత చలి ఉంది. అక్కడ వరుసగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్పంగా కార్గిల్లో మైనస్ 13.5 డిగ్రీల ఉష్ణోగ్రత.. శ్రీనగర్లో మైనస్ 6డిగ్రీలు రికార్డైంది. సరస్సులు, జలపాతాల్లోని నీరు మొత్తం గడ్డకట్టుకుపోయింది.