పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. ఆ దేశానికి చెందిన నాలుగు సంస్థలపై ఆంక్షలు విధించింది. అక్తర్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్‌సైడ్ ఎంటర్ప్రైజెస్ సహా ప్రభుత్వానికి చెందిన నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్(NDC) కూడా ఉంది. NDC సామూహిక జనహనన ఆయుధాలను అందిస్తోందని తెలిపింది. కాగా, సైనికపరమైన అసమానతలను సృష్టిస్తే ప్రాంతీయంగా అస్థిరత తలెత్తుతుందని పాక్ పేర్కొంది.