NLG: ఈ నెల 19, 20 తేదీల్లో జరగనున్న సైన్స్ ఎగ్జిబిషన్ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు డీఈఓ బి.బిక్షపతి తెలిపారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున మంత్రి కోమటిరెడ్డితో ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యే అవకాశం లేనందున సైన్స్ ఎగ్జిబిషన్‌ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. తదుపరి తేదీని త్వరలో తెలియజేస్తామని డీఈఓ తెలిపారు.