SKLM: రోగులకు మెరుగైన సేవలందించాలని వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.విజయపార్వతి కోరారు. పాలకొండ మండలంలోని ఎం.సింగుపురం PHCని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్యసేవలు, పనితీరు పై ఆరా తీసీ రోగుల ఆరోగ్య వివరాలు తనిఖీ చేశారు. ఓపీ రికార్డులు, అత్యవసర మందులు, కుక్క, పాము కాటు ఇంజక్షన్ల లభ్యతలను పరిశీలించారు.