ASR: కొయ్యూరు మండలంలోని దవడగొయ్యి, బీ.కొత్తూరు, జోగుంపేట, రాజులపాడు అంగన్వాడీ కేంద్రాల్లో 4 ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలని సీడీపీవో విజయ కుమారి గురువారం సూచించారు. స్థానికంగా నివాసం ఉంటున్న వివాహిత మహిళా అభ్యర్ధులు ఈనెల 31వ తేదీలోగా ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని సూచించారు.