హెల్త్‌కేర్ టెక్నాలజీ కంపెనీ ఇన్వెంటరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ ఇవాళ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. NSEలో 43% ప్రీమియంతో రూ.1900 వద్ద, BSEలో 39.65 శాతం లాభంతో రూ.1,856 వద్ద షేర్లు ప్రారంభమయ్యాయి. లిస్టింగ్ నేపథ్యంలో ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.32,977కోట్లకు చేరింది. కాగా, రూ.2,498 కోట్ల సమీకరణ లక్ష్యంగా IPOకి వచ్చిన ఈ కంపెనీ ధరల శ్రేణిని రూ.1,265-1,329గా నిర్ణయించింది.