ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని మిన్నేకల్లు గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని గురువారం గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని రైతులు భూ వివాదాలకు సంబంధించి అర్జీలు సమర్పించాలని తెలియజేశారు. అలాగే ప్రతి అర్జీకి పూర్తి స్థాయిలో సిబ్బంది విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.