అమెరికాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతోంది. కాలిఫోర్నియాలో 34 మందికి వైరస్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు గవర్నర్ గవిన్ న్యూసమ్ ప్రకటించారు. దక్షిణ కాలిఫోర్నియాలోని డెయిరీ ఫాంలోని ఆవుల్లో ఈ కేసులను వైద్యులు గుర్తించారు. అయితే, ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ సంక్రమించిన దాఖలాలు లేవని తెలిపారు.