భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన టీ20ల్లో భారీ రికార్డుపై కన్నేసింది. ఆమె మరో 34 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా రికార్డు సృష్టిస్తుంది. ఇవాళ భారత్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్లో మంధాన ఈ రికార్డను సాధించే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం చమరి ఆటపట్టు (720) అగ్రస్థానంలో ఉంది.