AP: వైసీపీ నేత అవినాశ్ రెడ్డి పీఏ వర్రా రవీందర్ రెడ్డి కేసు విచారణ వాయిదా పడింది. ఈ నెల 23కు విచారణ వాయిదా వేస్తూ కడప కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కేసు విచారణ నేపథ్యంలో విశాఖ జైలు నుంచి పీటీ వారెంట్‌పై వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు కడపకు తీసుకువచ్చారు. సామాజిక మాధ్యమాల్లో టీడీపీపై అసభ్యకర పోస్టులు పెట్టారని వర్రాపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.