సిద్దిపేటలో గురువారం స్థానిక పోలీసు అధికారులతో కలిసి ఆర్ఏఎఫ్ ర్యాలీ నిర్వహించారు. ఆర్ఏఎఫ్ ర్యాలీని పోలీస్ కమిషనర్ అనురాధ ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. సిద్దిపేటలోని పాత బస్టాండ్ నుంచి మెదక్ ప్రధాన రోడ్డు విక్టరీ చౌరస్తా మీదుగా గాంధీ చౌక్, నరసాపూర్ చౌరస్తా వరకు ఆర్ఏఎఫ్ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పోలీసు ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.