TG: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు ప్రభుత్వం అండగా ఉండాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ కారణమవుతుందని మండిపడ్డారు. 93 మంది ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. ఆటో కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దని.. ఆటో డ్రైవర్లకు BRS అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని హామీ ఇచ్చారు.