ఎన్టీఆర్ 30 తుఫాన్ హెచ్చరిక వచ్చేసింది. ఎట్టకేలకు బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు కొరటాల శివ. నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. తాజాగా ఎన్టీఆర్ 30 ముహూర్తం ఫిక్స్ చేసేశారు. ఎన్టీఆర్ 30వ చిత్రానికి మార్చి 23న ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సాలిడ్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది.
ఎన్టీఆర్ 30 తుఫాన్ హెచ్చరిక వచ్చేసింది. ఎట్టకేలకు బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు కొరటాల శివ. నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. తాజాగా ఎన్టీఆర్ 30 ముహూర్తం ఫిక్స్ చేసేశారు. ఎన్టీఆర్ 30వ చిత్రానికి మార్చి 23న ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సాలిడ్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. లాస్ట్ ఇయర్ ఈ సినిమాను ప్రకటించినప్పుడు.. సముద్రం బ్యాక్ డ్రాప్లో ఎన్టీఆర్ బ్యాక్ సైడ్ లుక్ చూపించారు. పవర్ ఫుల్ డైలాగ్‌తో ఊచకోత కోయబోతున్నట్టు చూపించారు. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్‌ను ఫిక్స్ చేసినప్పుడు.. పల్లెటూరి అమ్మాయిగా.. ఎగసిపడుతున్న కెరటాల్లో చూపించాడు. ఇక ఇప్పుడు సముద్ర కెరటాల్లో.. భగ భగ మండుతున్న సూర్యడిని సింబాలిక్‌గా చూపిస్తు.. కొడవలి ఆకారంలో ఉండే ఆయుధాన్ని చూపించాడు. దీన్ని బట్టి చూస్తే.. ఈ సినిమా మొత్తం పోర్ట్ బ్యాక్ డ్రాప్లోనే రాబోతోందని చెప్పొచ్చు. ఈ లెక్కన ఎన్టీఆర్ ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్నట్టే. ఆచార్య రిలీజ్ సమయంలో.. ఇది తన కరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఫిల్మ్ అని.. భారీ ఎమోషనల్ డ్రామా అని క్లారిటీ ఇచ్చాడు కొరటాల. ఇప్పుడు దాన్నే ప్రజెంట్ చేస్తూ అనౌన్స్మెంట్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కొంత వరకు వెయిట్ లాస్ కూడా అవుతున్నాడు. ఇక వన్స్ సెట్స్ పైకి వెళ్లాక.. ఎన్టీఆర్ 30ని పరుగులు పెట్టించబోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నాడు కొరటాల. ఎట్టి పరిస్థితుల్లోను నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.