TPT: శ్రీకాళహస్తి పట్టణం వీఎం పల్లి వద్ద వంతెనపై లారీ చక్రాల కింద పడి శనివారం యువతి మృతి చెందింది. తిరుపతి నుంచి నాయుడుపేట వైపు వెళ్తున్న లారీని తిరుపతి నుంచి నెల్లూరుకు బైక్పై వెళ్తున్న నెల్లూరుకు చెందిన హేమలత (22) ఒవర్టేక్ చేసింది. ఈ క్రమంలో ఆమె బ్యాగు లారీకి తగిలి లారీ చక్రాల కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.