కోనసీమ: ముమ్మిడివరంలో ఒక బేకరీలో పనిచేస్తున్న బెంగళూరుకు చెందిన చేతన్ గౌడ్ (19) అనే వ్యక్తి శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శుక్రవారం రాత్రి బేకరీ నుంచి రూమ్‌కి వెళ్లి నిద్రించిన చేతన్ ఉదయం లేవలేదు. తోటి వారు నిద్ర లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.