NLG: మునుగోడులో రూ.200 కోట్లతో 2,500 మంది విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం ప్రారంభించడం శుభపరిణామమని MLA రాజగోపాల్ రెడ్డి తెలిపారు. CM రేవంత్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 79 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. విద్యకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు.