Ajay devgan:అజయ్ దేవ్గన్-టబు మధ్య రిలేషన్ షిప్ ఉందనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అజయ్ స్పందిస్తూ.. తమది కంఫర్టబుల్ ఫ్రెండ్ షిప్ అని చెప్పాడు.
Ajay devgan:అజయ్ దేవ్గన్ (Ajay devgan)-టబు (Tabu) మధ్య రిలేషన్ షిప్ ఉందనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అజయ్ (Ajay devgan) స్పందిస్తూ.. తమది కంఫర్టబుల్ ఫ్రెండ్ షిప్ అని చెప్పాడు. అంతేకానీ తమ మధ్య ఏమీ లేదన్నాడు. ఇండస్ట్రీకి రాకముందు నుంచే ఇద్దరి మధ్య స్నేహాం (friend) ఉందని తెలిపాడు. అజయ్-కాజొల్ని ప్రేమించి పెళ్లి చేసుకోగా.. టబు మాత్రం ఒంటరిగానే ఉంటోంది. అజయ్‌తో రిలేషన్ షిప్ వళ్లే ఆమె పెళ్లి చేసుకోలేదని వార్తలు గుప్పుమన్నాయి. వారిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉందనే చర్చ వచ్చింది.
ఇద్దరూ కలిసి ఇటీవల భోలా (bhola) అనే మూవీలో నటించారు. మూవీ ప్రమోషన్లో భాగంగా ఇద్దరూ కలిసే ఉండగా.. మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. టీనేజ్ నుంచి ఒకరికొకరం తెలుసు అని అజయ్ (ajay) చెప్పాడు. తమ మధ్య కంఫర్టబుల్ ఫ్రెండ్ షిప్ ఉందని.. ఒక్కొసారి తిట్టుకుంటామని కూడా చెప్పాడు.
తమిళ్లో కార్తీ నటించిన ఖైదీ (khaidi) మూవీ రీమేక్‌గా భోలా తెరకెక్కింది. ఇందులో అజయ్-టబు (Ajay devgan-tabu), దీపక్ డోబ్రియాల్, సంజయ్ మిశ్రా, గజరాజ్ రావు కీ రోల్ పోషించారు. ప్రత్యేక పాత్రల్లో అభిషేక్ బచ్చన్, అమలా పాల్ నటించారు. రీమేక్‌లో చాలా మార్పులు చేశామని అజయ్ రివీల్ చేశారు. అజయ్ టబు కలిసి జంటగా విజయ్ పథ్, పెహ్లా పెహ్లా ప్యార్ మూవీల్లో నటించారు. హాకీకత్, తక్షక్, దృశ్యం, గోల్ మాల్ ఎగైన్, దే దే ప్యార్ దే సినిమాల్లో కూడా నటించారు.