మొబైల్ స్క్రీన్ టైమ్‌ను పరిమితం చేసిన తల్లిదండ్రులను చంపటం సరైన పని అంటూ ఓ యువకుడికి AI సలహా ఇచ్చిన ఘటన USలో జరిగింది. ఈ సమాధానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలుడి తల్లిదండ్రులు.. ఆ AI చాట్‌బాట్‌పై దావా వేశారు. చిన్నారులు, యువకుల్లో హింసను ప్రోత్సహిస్తోందని, వెంటనే ఆ AI సంస్థను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు సహకరించిన గూగుల్‌ను ప్రతివాదిగా చేర్చటం గమనార్హం.