CTR: పలమనేరు రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 11 వాణిజ్య సముదాయ గదులను శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లబ్ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం తెలియజేశారు. అనంతరం మరమ్మతుల చేపట్టబడిన రిక్రియేషన్ క్లబ్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన కంటి వైద్య శిభిరంలో ఆయన పాల్గొన్నారు.