‘దువ్వాడ జగన్నాథం’లో అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశంపై తన అనుభవాలను నటి హరితేజ పంచుకుంది. బన్నీ పక్కన స్లిమ్‌గా కనిపించాలని గట్టి నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. అందుకోసం వరుసగా 15 రోజుల పాటు కేవలం లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకున్నానని, సాధారణ ఆహారం పూర్తిగా మానేసి కష్టపడ్డానని తెలిపింది. ఈ క్రమశిక్షణతోనే తాను సినిమాలో పర్ఫెక్ట్గా కనిపించానని పేర్కొంది.