»Marriage Of A Woman With Lord Krishna Idol At Auraiya District Of Uttar Pradesh
Woman Marriage Lord Krishna: శ్రీకృష్ణుడితో మహిళ పెళ్లి..తర్వాత అప్పగింతలు కూడా!
ఓ 30 ఏళ్ల మహిళ రక్ష సరికొత్తగా శ్రీకృష్ణుడి విగ్రహాంతో(Lord Krishna idol) పెళ్లి(marriage) చేసుకుంది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) లోని ఔరయ్యా జిల్లాలో(Auraiya District) ఆదివారం జరిగింది. చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడిని ఆరాధిస్తున్న ఆ యువతి ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతోపాటు వారి పేరెంట్స్(parents)ను కూడా ఒప్పించింది. దీంతోవారు ఆ మహిళ(women)కు వారి సంప్రదాయాల ప్రకారం బంధమిత్రల సమక్షంలో ఘనంగా వివాహం జరిపించారు. తర్వాత అప్పగింతలు, బరాత్ కార్యక్రమం కూడా నిర్వహించారు.
ఇటివల కాలంలో తనను తాను పెళ్లి చేసుకున్న సంఘటనలు. మరోవైపు ఇద్దరు మహిళలు లేదా ఇద్దరు పురుషులు మ్యారేజ్ చేసుకున్న సందర్భాలు చుశాం. కానీ తాజాగా మరోకటి సరికొత్తగా పెళ్లి చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ(women) తాను ప్రతి రోజు పూజించే శ్రీకృష్ణుడినే(Lord Krishna) పెళ్లి(marriage) చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం తన తల్లిదండ్రులను(parents) సైతం ఒప్పించింది. దీంతో ఆదివారం బంధుమిత్రులు, సన్నిహితుల ఆధ్వర్యంలో కళ్యాణ మండపాన్ని అందంగా అలంకరించి ఆమెకు వివాహం జరిపించారు. ఈ పెళ్లి వేడుకను వారి సంప్రదాయ పద్దతుల ప్రకారం ఘనంగా నిర్వహించారు. ఈ సంఘటన యూపీ(UP)లో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ వివాహ వేడుకకు అతిథులను ఆహ్వానించి, వారికి ఆహారం(food), పానీయాలు సంగీతం(music) సహా అనేక ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు పెళ్లి తర్వాత శ్రీకృష్ణుడి విగ్రహాన్ని మోసుకెళ్లిన కళ్యాణ ఊరేగింపు కూడా జరిపారు. అక్కడ డీజే సంగీతానికి పలువురు నృత్యాలు కూడా చేశారు. రాత్రిపూట వివాహ వేడుక తర్వాత వధువు కృష్ణుడి విగ్రహంతో జిల్లాలోని సుఖ్చైన్పూర్ ప్రాంతంలోని తన బంధువుల ఇంటికి బయలుదేరింది. తరువాత ఆమె తన ఒడిలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని(Lord Krishna idol)పెట్టుకుని తన తల్లి ఇంటికి తిరిగి వచ్చింది.
ఈ అపూర్వ వివాహ వేడుక సంఘటన ఉత్తర్ ప్రదేశ్లోని(Uttar Pradesh) ఔరయ్య జిల్లా(Auraiya District)లో చోటుచేసుకుంది. రిటైర్డ్ ఉపాధ్యాయుడు రంజిత్ సింగ్ సోలంకి(Ranjit Singh Solanki) కుమార్తె రక్ష (30) పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఎల్ఎల్బి చదువుతోంది. శ్రీకృష్ణునిపై తనకున్న అంకితభావంతోనే కృష్ణుడి విగ్రహంతో(Lord Krishna idol) వివాహం చేసుకున్నట్లు యువతి రక్ష తెలిపింది. ఆ క్రమంలో తాను జీవితాంతం శ్రీకృష్ణుడితోనే సన్నిహితంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది.
ఇది తెలిసిన పలువురు దేవుని విగ్రహంతో పెళ్లి ఎంటని కామెంట్లు(comments) చేస్తుండగా..మరికొంత మంది మాత్రం గతంలో కొంత మంది మాత్రం దేవుడి కోసం అలాగే చేసేవారని అంటున్నారు. దేవాన్ని ఆరాదిస్తూ అలాగే ఉండేవారని చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్(comment) రూపంలో తెలియజేయండి.