»Gujarat Woman Dies Of H3n2 Virus 3rd Death In India
H3N2 Virus కలకలం, మరొకరు మృతి.. 3కు చేరిన మరణాల సంఖ్య
H3N2 Virus:హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) బెంబేలెత్తిస్తోంది. వైరస్ (virus) సోకి ఇప్పటికే ఇద్దరు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు మరొకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. గుజరాత్‌కు (gujarat) చెందిన 58 ఏళ్ల మహిళ హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలతో చనిపోయిందని వైద్యులు (doctors) నిర్ధారించారు.
Gujarat woman dies of H3N2 Virus, 3rd death in india
H3N2 Virus:హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) బెంబేలెత్తిస్తోంది. వైరస్ (virus) సోకి ఇప్పటికే ఇద్దరు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు మరొకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. గుజరాత్‌కు (gujarat) చెందిన 58 ఏళ్ల మహిళ హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలతో చనిపోయిందని వైద్యులు (doctors) నిర్ధారించారు. హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) వైరస్‌ను హాంకాంగ్ వైరస్ అని పిలుస్తున్నారు. ప్లూ లక్షణాలతో బాధపడుతున్న మహిళను వడోదర (vadodara) ఆస్పత్రికి తరలించగా.. ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు.
హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) లక్షణాలు కూడా కరోనాను (corona) పోలిన విధంగా ఉన్నాయి. శ్వాస సంబంధ సమస్యతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్నాయని ఐసీఎంఆర్ (icmr) పేర్కొంది. జనవరి 2వ తేదీ నుంచి భారతదేశంలో హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) కేసులను నమోదు చేశారు. ఈ నెల 5వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 451 కేసులను గుర్తించారు. వారిలో ముగ్గురు చనిపోయారు.
కొత్త వైరస్ సోకితే భయపడొద్దని వైద్యులు (doctors) సూచిస్తున్నారు. సందేహాం ఉంటే టెస్ట్ (test) చేయించుకోవాలని.. అలాగే వైద్యుల (doctors) సూచన మేరకు మందులు వాడాలని పేర్కొన్నారు. ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సో.. భయపడకుండా మందులు వేసుకుంటూ.. వైరస్ తగ్గించుకోవాలని వైద్యులు కోరుతున్నారు.
హెచ్3ఎన్2 కేసులు (H3N2 Virus) అన్ని రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని.. తెలంగాణ (telangana), ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) రాష్ట్రాలను ఐసీఎమ్ఆర్ (icmr) అప్రమత్తం చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో సభలు, సమావేశాలు జరుగుతుండటం ఓ కారణం అట. దీంతోపాటు వైద్యం కోసం విదేశీయులు (foreigners) ఇక్కడికి వస్తుండటం మరో రీజన్ అవుతుంది. దీంతో వైరస్ వేగంగా వ్యాపించేందుకు కారణం అవుతున్నాయని చెబుతున్నాయి. దీనికితోడు ప్రజలు మాస్క్ (no mask) ధరించడం లేదని వెల్లడించాయి.