ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులతో అంతర్జాతీయ శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతుందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తంచేసింది. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించి శాంతియుతంగా వివాదాలు పరిష్కరించుకోవాలని సూచించింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ మిసైల్ దాడులు చేస్తుండగా.. వాటిని అమెరికా, UK ఫైటర్ జెట్స్ అడ్డుకుంటున్నాయి. మరోవైపు సెంట్రల్ ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ మిసైళ్లతో విరుచుకుపడుతోంది.