శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (100) ఈ టోర్నీలో రెండో సెంచరీతో చెలరేగగా, మరో ఓపెనర్ ఫకర్ జమాన్(84) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరి ధాటికి పాక్ 20 ఓవర్లలో 212/8 భారీ స్కోరు సాధించింది. అయితే, పాక్ సెమీస్కు అర్హత సాధించాలంటే.. ఈ మ్యాచ్లో 65 పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంది.