గద్వాల: పదో తరగతి పరీక్షలు అంటే భయం వద్దు, ఒత్తిడిని వీడి ప్రశాంతంగా చదివితే విజయం మీదే అని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గద్వాల బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్, ఫుడ్ ఫెస్టివల్‌ను ఆయన సందర్శించారు. విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక నమూనాలను ప్రశంసించారు.