కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రేపు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన నాకౌట్ మ్యాచ్ జరగనుంది. గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుతుండగా, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్ జరిగే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందని సమాచారం. రెండు జట్లలోనూ విధ్వంసకర పవర్ హిట్టర్లు ఉండటంతో భారీ స్కోర్లు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.