విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మహిళా కార్పొరేటర్లు వినూత్న డిమాండ్‌తో నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిల్ కాలపరిమితి ముగింపు సందర్భంగా కార్పొరేటర్ల కోసం స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తామని మేయర్ ప్రతిపాదించగా, మహిళా సభ్యులు దీనిని వ్యతిరేకిస్తూ ఆటలు కాకుండా విహారయాత్ర ఏర్పాటు చేయాలని కోరారు. పార్టీలకు అతీతంగా ఏకమై తమ డిమాండ్‌ను వినిపించారు.